అధిష్టానం ఆదేశిస్తే ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌పై పోటీ చేసేందుకు సిద్ధం - మీట్ ది ప్రెస్ లో ఈటెల


 అధిష్టానం ఆదేశిస్తే ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌పై పోటీ చేసేందుకు సిద్ధం - మీట్ ది ప్రెస్ లో ఈటెల


హైదరాబాద్ : తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నబీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మాట్లాడుతూ అధిష్టానం ఆదేశిస్తే ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌పై పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తనకు బండి సంజయ్‌కు మధ్య ఎలాంటి  విభేదాలు లేవని, కేసీఆర్ అండ్ గ్రూప్ ఇలాంటి ఈ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయించడం తాను కాంగ్రెస్‌లోకి వెళ్తాననే ప్రచారం సీఎం కేసీఆర్‌ చేయిస్తున్నాడని మండిపడ్డారు.

 తనెప్పుడూ గ్రూపులు కట్టలేదని 20 ఏళ్ల రాజకీయ జీవితం తెరిచిన పుస్తకంలా ఉన్నదని స్పష్టం చేశారు. టిఆర్ఎస్ పార్టీ నుంచి మంత్రిగా బర్తరఫ్ చేసి అవమానించి వెళ్లగొట్టరని పార్టీలు మారే సంస్కృతి తనది కాదని అన్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి తాను బయటకు రాలేదని వెళ్లగొట్టరని అన్నీ ఆలోచించుకున్న తరువాతే బీజేపీలో చేరానని వెల్లడించారు.

కెసిఆర్ తెలంగాణ సెంటి మెంటును అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్నరని తెరాస పాలన పోతేనే ప్రజలకు శని వదులుతుందాని ప్రజాస్వామ్య పద్ధతిలో లో పాలించే ప్రభుత్వం కావాలని ప్రజలు కొరు కుంటున్నరని అది బీజేపీ తోనే సాధ్యం అన్నారు. వచ్చే ఎన్నికల్లో తప్పక బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు  

బీజేపీ, టీఆర్‌ఎస్‌ కలిసి పోటీ చేస్తాయనేది ఊహజనితమని  టీఆర్‌ఎస్‌తో దోస్తీ లేదని, ఇక కొట్లాటనే ఉందన్నారు. బీజేపీ వచ్చే ఎన్నికలలో వంటరి పోరుకు సిద్దంగా ఉన్నదన్నారు. కేసీఆర్‌ దిగిపోయి కేటీఆర్‌ను తెలంగాణకు ముఖ్యమంత్రిని చేసే అంశం టీఆర్‌ఎస్‌ పార్టీలో అంతర్గతంగా ఉందని అన్నారు. మెజారిటీ టీఆర్ఎస్ నేతలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని, టీఆర్‌ఎస్‌ మునిగి పోయే పడవ అని పార్టీకి  భవిష్యత్తు లేదని నేతలే చెప్తున్నారని తెలిపారు. ఉద్యమ కారులపై రాళ్ళు రువ్వి రక్తం కల్లచుసిన  ఉద్యమ ద్రోహులకు MLC ఇస్తూ ఉద్యమ కారులను కెసిఆర్  అవమానిస్తూన్నారని ఇదితెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు.

కెసిఆర్ ప్రభుత్వ ఖజానాకు కాపలదారులే తప్ప వారసులు కాదని కేసీఆర్ కుటుంబం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. థర్డ్ ఫ్రంట్ సంగతి అటుంచి.. మెదట  సొంత రాష్ట్రాన్ని కేసీఆర్ చక్కదిద్దుకోవాలని ఎద్దేవా చేశారు. నిధులు , నీళ్ళు, నియామకాల కోసం తెలంగాణ తెచ్చుకుంటే 

‘ఏడున్నరేళ్ళుగా కేసీఆర్ ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని. ముఖ్యమంత్రికి ముందు చూపు లేకపోవడం వలన రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కెసిఆర్ కు రైతు బంధు అవసరమా వందల ఏకరాలు ఉన్న భూస్వాములకు రైతు బంధు ఇవ్వవద్దని అదే డబ్బు భూమిని నమ్ముకొని బతుకుతున్న  కౌలు రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశామని ఇది కెసిఆర్ పెడచెవిన పెట్టారు అన్నారు.కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ మాటలపై ప్రజలు నమ్మకం కోల్పోయారని 7 ఏళ్లుగా దటవేసుడు దొరనితో పబ్బం గడుపుతున్నారని ప్రజలకు న్యాయం చేసే ఉద్దేశం లేదన్నారు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించి.. తర్వాత సమర్థించిన చరిత్ర కేసీఆర్‌ది. కలసికట్టుగా పోరాడాల్సిన సమయం వచ్చింది. వ్యక్తిగత అవసరాల కోసం లొంగిపోవడం. హుజురాబాద్ ఓట్ల‌ కోసమే కేసీఆర్ దళితబంధు తీసుకొచ్చాడని  పేదలపై నిజమైన ప్రేమ ఉంటే దళితబంధు ఇప్పటికీ ఎందుకు ఇవ్వటం లేదు? నా చర్మం వలిచి చెప్పులు కుట్టించినా హుజురాబాద్ ప్రజల రుణం తీర్చుకోలేను. సంబంధిత మంత్రులు లేకుండా శాఖలపై రివ్యూ చేసిన నీచ చరిత్ర సీఎం కేసీఆర్‌ది’ అని తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. ముఖ్యమంత్రి జర్నలిస్టును విస్మరించడం సిగ్గుచేటని అడుగులకు మడుగులు అదే ఒకరిద్దరిని తప్పా రాష్ట్రంలో ఏ ఒక్క జర్నలిస్టుల సమస్యలు తీర్చలేదని  బిజెపి ప్రభుత్వం వస్తే జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ప్రసాదరావు ప్రధాన కార్యదర్శి స్వామి ఐ ఎఫ్ డబ్ల్యూ జే జాతీయ వర్కింగ్ కమిటీ మెంబర్ పెద్దాపురం నరసింహ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు అశోక్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్

కామారెడ్డి జిల్లా అధ్యక్షులు బాపు రావు గండ్ర నరేంద్ర , శ్రీనివాస్, సిద్ధల రవి, చిన్న పత్రికల సంఘం అధ్యక్షులు యూసుఫ్ బాబు తదితరులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న శాసనమండలి చైర్మన్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు

కలక్టరేట్ లో ఓ అపరిచితుడు *అగ్రకుల అహంకారం తో వేధిస్తున్న ఓ అధికారి*

ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది సాయి కుమార్ ఆర్టీఐ దరఖాస్తు సంధించడం తో లీగల్ సర్వీస్ అథారిటీ లోరివైసీడ్ గైడ్ లైన్స్ తో నోటిఫికేషన్