జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్నకు బెయిల్


 జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్నకు  బెయిల్

హైదరాబాద్:  ప్రముఖ న్యూస్ జర్నలిస్ట్ , రాజకీయ నాయకులు తీన్మార్ మల్లన్న కు బెయిల్ మంజూరైంది. తీన్మార్ మల్లన్న పై నమోదు అయిన… అన్ని కేసుల్లోనూ… బెయిల్ మంజూరు అయినట్టు సమాచారం అందుతోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. మరి కాసేపట్లోనే దీనిపై ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది. సోమవారం సాయంత్రం జైలు నుంచి విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఓ జ్యోతి‌ష్యు‌డిని బ్లాక్‌ మెయిల్‌ చేసి రూ.30 లక్షలు డిమాండ్ చేశారన్న ఆరోపణలతో తీన్మార్ మల్లన్న ఆగస్టులో అరెస్ట్ అయ్యారు. ఆ సమయంలో క్యూ న్యూస్ కార్యాలయంలో పోలీసులు సోదాలు జరిపి కొన్ని హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. తీన్మార్ మల్లన్నపై ఇప్పటివరకు 38 కేసులు నమోదు కాగా అందులో 6 కేసులను హైకోర్టు కొట్టివేసింది. మిగతా 32 కేసులో 31 కేసులకు బెయిల్ మంజూరైంది. తీన్మార్ మల్లన్న 74 రోజులు జైల్లో ఉన్నారు. కాగా తన భర్తపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మల్లన్న భార్య ఇటీవల హోంమంత్రి అమిత్ షాను సైతం కలిసి ఫిర్యాదు చేశారు. జాతీయ బీసీ కమిషన్ కూడా కేసుల విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసింది. 

Comments

Popular posts from this blog

స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న శాసనమండలి చైర్మన్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు

కలక్టరేట్ లో ఓ అపరిచితుడు *అగ్రకుల అహంకారం తో వేధిస్తున్న ఓ అధికారి*

ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది సాయి కుమార్ ఆర్టీఐ దరఖాస్తు సంధించడం తో లీగల్ సర్వీస్ అథారిటీ లోరివైసీడ్ గైడ్ లైన్స్ తో నోటిఫికేషన్