*తహశీల్దార్‌పై కిరోసిన్‌ పోసి నిప్పంటిన దుండుగుడు*

*తహశీల్దార్‌పై కిరోసిన్‌ పోసి నిప్పంటిన దుండుగుడు*


 


రంగారెడ్డి: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్‌ విజయరెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో తహశీల్దార్‌ విజయరెడ్డి తీవ్ర గాయాలతో అక్కడిక్కడే మృతి చెందారు. ఆమెకు కాపాడాటానికి ప్రయత్నించిన పలువురు కూడా గాయాల పాలయ్యారు. కార్యాలయంలో ఆమె విధులు నిర్వర్తిస్తున్న సమయంలోనే ఈ దారుణమైన ఘటన చోటుచేసుకోవడం సంచలనం రేపింది. తొలుత తహశీల్దార్‌తో మాట్లాడటానికి లోపలికి వెళ్లిన దుండుగుడు ఆమెపై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. విషయం తెలుసుకున్న పోలీసు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుడిని గౌరెల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.



నిందితులపై కఠిన చర్యలు.. 
తహశీల్దార్‌ దారుణ హత్య విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. నిందితులు ఎవరైనా చట్టపరమైన కఠిన శిక్షలు అమలు చేయాలి అధికారులను ఆదేశించారు. ఏదైనా సమస్య ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వచ్చి సమస్య పరిష్కరించేందుకు కృషి చేయాలే తప్ప అధికారులపై ఇలాంటి చర్యలు చేయడం దారుణమని అన్నారు. అనంతరం ఘటనాస్థలికి చేరుకుని అక్కడి అధికారులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు.


Comments

Popular posts from this blog

పులిహోర పంపిణీ

కలక్టరేట్ లో ఓ అపరిచితుడు *అగ్రకుల అహంకారం తో వేధిస్తున్న ఓ అధికారి*

ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది సాయి కుమార్ ఆర్టీఐ దరఖాస్తు సంధించడం తో లీగల్ సర్వీస్ అథారిటీ లోరివైసీడ్ గైడ్ లైన్స్ తో నోటిఫికేషన్