**టిటిడి సంచలన నిర్ణయం**

*టిటిడి సంచలన నిర్ణయం*


అమరావతి : ఎపి ప్రభుత్వం జీవో నంబర్‌ 2323 ను జారీ చేసిన నేపథ్యంలో.. టిటిడి సంచలన నిర్ణయం తీసుకుని జీవో 2323 ని అమలు చేసింది. దీంతో ఒకే రోజు 140 మందికి ఉద్వాసన పలికినట్టయింది. శ్రీవారి ఆలయ ఓయస్డీ డాలర్‌ శేషాద్రిని సైతం విధుల్లో నుంచి తొలగించింది. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న రిటైర్డ్‌ అధికారులు, సిబ్బందిని తక్షణమే తొలగించాలన్న జీవో నెంబర్‌ 2323 ను అమలు చేసింది. దీంతో తిరుమలో పనిచేస్తున్న 140 మంది ఉద్యోగాలను కోల్పోవాల్సి వచ్చింది. 2019 మార్చి 31 కి ముందు నియమితులైన కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులందరికీ ఈ జీవో వర్తించనుంది. దీంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు టిటిడి వర్గాలు చెబుతున్నాయి.


Comments

Popular posts from this blog

కలక్టరేట్ లో ఓ అపరిచితుడు *అగ్రకుల అహంకారం తో వేధిస్తున్న ఓ అధికారి*

పులిహోర పంపిణీ

ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది సాయి కుమార్ ఆర్టీఐ దరఖాస్తు సంధించడం తో లీగల్ సర్వీస్ అథారిటీ లోరివైసీడ్ గైడ్ లైన్స్ తో నోటిఫికేషన్